ఈ మూడింటిలో తెలంగాణ రైతులకు ఏది కావాలి?: కేటీఆర్

  • కేసీఆర్ నినాదం మూడు పంటలు అన్న కేటీఆర్
  • కాంగ్రెస్ విధానం మూడు గంటలు, బీజేపీ విధానం మతం పేరిట మంటలని విమర్శలు
  • మూడింటలో ఏది కావాలో రైతులు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని వ్యాఖ్య
బీజేపీ, కాంగ్రెస్ లను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం మూడు పంటలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం మూడు గంటలని, బీజేపీ విధానం మతం పేరిట మంటలని విమర్శించారు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? అని ప్రశ్నించారు. మూడింటిలో ఏం కావాలో తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని... మూడు గంటల కరెంట్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.


More Telugu News