గోవా నైట్ క్లబ్‌లో మహిళతో ఐపీఎస్ అధికారి అసభ్య ప్రవర్తన.. సస్పెన్షన్
- గోవాలో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్ ఐజీఎంయూటీ కేడర్ అధికారి కోవన్
- మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో నెట్టింట వైరల్
- అసెంబ్లీలో లేవనెత్తిన గోవా ఫార్వార్డ్ పార్టీ
- విచారణ జరిపి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
గోవాలోని ఓ నైట్ క్లబ్‌లో మహిళతో ఐపీఎస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సదరు ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది.
2009 బ్యాచ్ ఐజీఎంయూటీ కేడర్ ఐపీఎస్ అధికారి కోవన్ గోవాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నైట్ క్లబ్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ అంశాన్ని గోవా ఫార్వార్డ్ పార్టీ అసెంబ్లీలో లేవనెత్తింది. వేధింపులకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు నివేదికను ఇచ్చింది. దీంతో కేంద్ర హోంశాఖ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. తక్షణమే వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అతనిని గోవా పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేసింది.