యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించిన రజనీకాంత్

  • లక్నోలో ముఖ్యమంత్రి కార్యాలయంలో యోగిని కలిసిన రజనీకాంత్ 
  • కారులో నుండి దిగి యోగి వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించిన సూపర్ స్టార్
  • తన సినిమా విజయవంతం కావడం దేవుడి దయ అన్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు. రెండు చేతులతో నమస్కరించిన సూపర్ స్టార్ ఆ వెంటనే ఆయన పాదాలకూ నమస్కరించారు. 

సీఎం యోగి, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులతో కలిసి తన జైలర్ సినిమాను చూసేందుకు ఆయన లక్నోకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనను చూసి సూపర్ స్టార్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా హిట్ కావడం అంతా దేవుడి దయ అన్నారు. అంతకుముందు ఆయన ఝార్ఖండ్‌‌లోని రాంచీలో పర్యటించి, ఈ రాష్ట్రంలోని ప్రసిద్ధ చిన్నమస్త స్వామి ఆలయాన్ని సందర్శించారు. రాంచీలోని యాగోధ ఆశ్రమంలో గంటసేపు ధ్యానం చేశారు. అనంతరం రాజ్ భవన్‌లో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు.

లక్నోలో సినిమా చూసిన అనంతరం డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మాట్లాడుతూ... రజనీ నటనను ప్రశంసించారు. తనకు కూడా జైలర్ సినిమా చూసే అవకాశం వచ్చిందన్నారు. గతంలోను రజనీకాంత్ పలు సినిమాలను చూశానని, ఆయన అద్భుతమైన నటుడు అన్నారు. తన ప్రదర్శనతో సినిమాకు మరింత హైప్ తెస్తాడన్నారు.  


More Telugu News