జీ20కి భారత్ నాయకత్వం పేద దేశాల్లో ఆత్మవిశ్వాసం నింపింది: ప్రధాని మోదీ

  • ఈ ఏడాది జీ20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న భారత్
  • ఏడాది పాటు జీ20 కూటమికి అధ్యక్ష బాధ్యతల్లో భారత్
  • జీ20 కూటమిపై సానుకూల ప్రభావం కనిపిస్తోందన్న భారత్
  • ప్రపంచ దేశాలు భారత్ ను చూసే కోణంలో మార్పు వచ్చిందని వెల్లడి
ఈ ఏడాది జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తూ, శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. జీ20 సదస్సుకు భారత్ నాయకత్వం వహిస్తుండడం పేద దేశాల్లో ఆత్మవిశ్వాసం నింపిందని అన్నారు. 

మనదేశం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో జీ20 కూటమిపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. జీ20లో భారత్ దార్శనికత, అభిప్రాయాలను ప్రపంచ దేశాలు భవిష్యత్ కు రోడ్ మ్యాప్ గా భావిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. 

జీడీపీని దృష్టిలో ఉంచుకుని చూడడం నుంచి, మానవీయ కోణంలో చూసే దిశగా ప్రపంచం అడుగులు వేస్తోందని వివరించారు. అందుకు భారత్ ఛోదకశక్తిగా పనిచేస్తుందని అన్నారు. 

ఒకప్పుడు భారత్ అంటే 100 కోట్ల ఆకలి కడుపులు అన్నట్టుగా చూసేవారని, కానీ ఇప్పుడు ఆకాంక్షలతో కూడిన 100 కోట్ల మెదళ్లుగా, నైపుణ్యమున్న 200 కోట్ల చేతులుగా చూస్తున్నారని మోదీ ఉద్ఘాటించారు.


More Telugu News