ప్రపంచ వాతావరణ సదస్సు కోసం దుబాయ్ పయనమైన ప్రధాని మోదీ
- యూఏఈ అధ్యక్షతన ప్రపంచ వాతావరణ సదస్సు
- రేపు దుబాయ్ లో సమావేశం
- ఈ సమావేశానికి మోదీని ఆహ్వానించిన యూఏఈ అధ్యక్షుడు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రేపు (డిసెంబరు 1) ప్రపంచ వాతావరణ సదస్సు జరగనుంది. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) సదస్సులో భాగంగా జరుగుతున్న ఈ వాతావరణ కార్యాచరణ సమావేశానికి హాజరవడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దుబాయ్ పయనమయ్యారు. ఈ సదస్సుకు రావాలంటూ ప్రధాని మోదీని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ (అబుదాబి పాలకుడు) ఆహ్వానించారు.
దీనిపై మోదీ స్పందిస్తూ, యూఏఈ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుండడం సంతోషదాయకమని తెలిపారు. వాతావరణ పరిరక్షణ అంశంలో భారత్ కు యూఏఈ ముఖ్యమైన భాగస్వామిగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన జీ20 సమావేశాల్లోనూ వాతావరణ కార్యాచరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని మోదీ వివరించారు.