అవును... కేటీఆర్ చెప్పినట్లుగా సిగ్గుపడాల్సిందే!: సీఎం రేవంత్ రెడ్డి చురకలు
- కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు
- మీరా కుమార్ పరామర్శకు వచ్చినప్పుడు అడ్డుకున్నందుకు సిగ్గుపడాల్సిందేనని వ్యాఖ్య
- రైతులను అరెస్ట్ చేసి బేడీలు వేసి కోర్టుకు తరలించినందుకు సిగ్గుపడాలన్న రేవంత్ రెడ్డి
గవర్నర్ ప్రసంగం వింటుంటే సిగ్గనిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారని... కానీ తాను ఇప్పుడు చెప్పబోయే వాటికి ఆయన నిజంగానే సిగ్గుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన మీరాకుమార్ (లోక్ సభ మాజీ స్పీకర్) రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి ఆమెను అడ్డుకున్నందుకు తలవంచుకోవాల్సిందే అన్నారు.
రైతు రాజ్యమని చెప్పిన గత ప్రభుత్వం... ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపిన రైతులను అరెస్ట్ చేసి వారికి బేడీలు వేసి అమానుషంగా కోర్టుకు తీసుకు వెళ్లినందుకు సిగ్గుపడాల్సిందే అన్నారు.
పన్నెండో తరగతి ప్రశ్నాపత్రాలు సరిగ్గా దిద్దలేక... ప్రయివేటు వ్యక్తులకు కాంట్రాక్టు పద్ధతిన ఇవ్వడంతో పాతికమంది పిల్లలు చనిపోయినందుకు సిగ్గుపడాల్సిందే అన్నారు. పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేనందుకు, టీఎస్‌పీఎస్సీ పరీక్షలు జిరాక్స్ తీసి అమ్ముకున్నందుకు, 30 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయేలా చేసినందుకు... ఇలా అన్నింటికీ సిగ్గుపడాల్సిందే అన్నారు.