షర్మిల తనయుడి నిశ్చితార్థానికి హాజరైన పవన్ కల్యాణ్
- ఫిబ్రవరిలో పెళ్లితో ఒక్కటి కాబోతున్న రాజారెడ్డి, అట్లూరి ప్రియ
- నేడు హైదరాబాదులో ఎంగేజ్ మెంట్
- రాజారెడ్డి, అట్లూరి ప్రియలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తనయుడి ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు విచ్చేశారు. త్వరలో ఒక్కటి కాబోతున్న రాజారెడ్డి, అట్లూరి ప్రియలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల, బ్రదర్ అనిల్, రాజారెడ్డి, అట్లూరి ప్రియలతో కలిసి పవన్ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, పవన్ రాకతో గోల్కండ రిసార్ట్స్ లో కోలాహలం నెలకొంది.