ముగిసిన 'తండేల్' విలేజ్ షెడ్యూల్

  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
  • చందు మొండేటి దర్శకత్వంలో చిత్రం
  • ప్రధాన తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ
  • పాల్గొన్న నాగచైతన్య, సాయిపల్లవి, ఇతర ముఖ్య నటులు
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ ఓరియెంటెడ్ మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా విలేజ్ షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ లో ఓ అందమైన మత్స్యకార గ్రామంలో, పోర్టులో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి సహా కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తండేల్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


More Telugu News