కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు నటి శోభన ‘ఆల్ ద బెస్ట్’

  • శోభన మద్దతుకు ధన్యవాదాలు తెలిపిన రాజీవ్ చంద్రశేఖర్
  • ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె మద్దతు తనకు గర్వకారణమన్న బీజేపీ నేత
  • నేడు కేరళలో పర్యటించనున్న నరేంద్రమోదీ
  • ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు శోభనకు ఆహ్వానం
బీజేపీ నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు సీనియర్ నటి శోభన మద్దతు ప్రకటించారు. తిరువనంతపురం నుంచి బరిలోకి దిగిన ఆయనకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు. శోభన మద్దతుకు రాజీవ్ చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె తనకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి ఐకాన్‌ల నుంచి మద్దతు లభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన రాజీవ్ చంద్రశేఖర్ ఈసారి తిరువనంతపురంలో కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ శశిథరూర్‌, సీపీఐ అభ్యర్థి పన్నయన్ రవీంద్రన్‌లను ఢీకొంటున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ నేడు కేరళలో పర్యటించనున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు శోభనకు కూడా ఆహ్వానం లభించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ ఏడాది త్రిసూర్‌లో మోదీ పాల్గొన్న బీజేపీ మహిళా సాధికారత సభకూ శోభన హాజరయ్యారు. నేడు కేరళలో పర్యటించనున్న మోదీ త్రిసూర్ అభ్యర్థి సురేశ్ గోపీ తరపున అలత్తూరు నియోజకవర్గంలోని కున్నమంగళంలో, అనంతరం తిరువనంతపురం జిల్లాలోని కట్టక్కడలో కేంద్రమంత్రులు వి. మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్‌లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. కేరళలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.


More Telugu News