ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రష్యన్ మహిళకు విచిత్ర అనుభవం.. విమానాశ్రయ అధికారి తీరుపై విస్మయం.. వీడియో వైరల్!
- ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ నిర్వాకం
- బోర్డింగ్ పాస్‌పై ఫోన్ నంబర్ రాసి, తర్వాత తనను సంప్రదించమని రష్యన్ మహిళను కోరిన అధికారి
- తనకు ఎదురైన ఈ సంఘటనను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసిన ట్రావెల్ వ్లాగర్
రష్యాకు చెందిన ట్రావెల్ వ్లాగర్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ ఒకరు తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వడంతో పాటు నెక్స్ట్ టైమ్ ఇండియాకు వచ్చినప్పుడు తనకు కాల్ చేయమన్నారని రష్యన్ మహిళ తెలిపారు. ఈ సంఘటనను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశంలో తన అనుభవాలను డాక్యుమెంట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ వీడియోలకు పేరుగాంచిన రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారా. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తనకు అక్కడ ఓ పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ నుంచి ఎదురైన ఈ అనుభవాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఆ అధికారి తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే తదుపరి భారత పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా తనను సంప్రదించమని కోరినట్లు దినారా వీడియోలో వెల్లడించారు. 'అరే యార్, ఏంటీ ఈ ప్రవర్తన?' అంటూ ఆమె అసహనాన్ని వ్యక్తం చేయడం వీడియోలో ఉంది. అలాగే బోర్డింగ్ పాస్‌ను కూడా చూపించారామె.
అయితే, సదరు అధికారి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ సందర్భంగా అధికారి చర్యలపై దినారా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన వృత్తిపరమైన సరిహద్దులను దాటారని ఆమె ఆరోపించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు 'ఆమెకు సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఆ అధికారి అలా చేసి ఉండొచ్చని' పాజిటివ్‌గా కామెంట్ చేస్తే, మరికొందరు 'మనోళ్లు మారరా? ఎప్పటికీ ఇంతేనా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.