అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపిన సీఎం రేవంత్ రెడ్డి

  • అమిత్ షా ఫేక్ వీడియోతో తనకు సంబంధం లేదన్న రేవంత్ రెడ్డి
  • తాను తెలంగాణ సీఎంవో, వ్యక్తిగత ఖాతాను మాత్రమే వినియోగిస్తున్నానని వెల్లడి
  • తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని స్పష్టీకరణ
రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియో అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ముఖ్యమంత్రి సమాధానం పంపించారు. రేవంత్ రెడ్డి తరఫున ఆయన లాయర్ పోలీసులకు లేఖను అందించారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, తన వ్యక్తిగత ఖాతాను మాత్రమే వినియోగిస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడని మాటలకు సంబంధించిన ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఫేక్ వీడియోపై ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలోనూ బీజేపీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోనూ కేసు నమోదయింది. దీంతో మే 1వ తేదీలోగా ఈ ఫేక్ వీడియోపై సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి ఈరోజు సమాధానం పంపించారు.


More Telugu News