అమెరికాలో బైక్ ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం

  • బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదం
  • మృతుడి కుటుంబానికి భారతీయ ఎంబసీ సానుభూతి
  • మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు తగు చర్యలు తీసుకున్నట్టు వెల్లడి
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు బీలం అచ్యుత్ దుర్మరణం చెందాడు. అతడు న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. 

‘‘న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి బుధవారం మధ్యాహ్నం జరిగిన  బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్ కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం’’ అని కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’ లో పోస్టు పెట్టారు.


More Telugu News