కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

  • 9,725 ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్
  • అంతకుముందు రెండుసార్లు బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీగణేశ్
  • గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన అభ్యర్థి
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ నుంచి వంశతిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ చేశారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై శ్రీగణేశ్ 9,725 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీగణేశ్ 2018, 2023లలో బీజేపీ నుంచి పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు.


More Telugu News