'తన ఇంటి పక్కన నివసించే ప్రజలను జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడో ఈ డాక్టర్ మాటల్లో వినండి' అంటూ వీడియో పోస్ట్ చేసిన టీడీపీ

  • జగన్ ఇంటి వద్ద సెక్యూరిటీ అగచాట్లు తప్పాయంటూ హర్షం
  • వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన స్థానిక వైద్యుడు
  • తాడేపల్లి ప్యాలస్ వద్ద పోలీసుల హడావుడి తొలగిందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వద్ద సెక్యూరిటీ అడ్డంకులు తొలగిపోయాయి. ఇన్నాళ్లూ ఆ రోడ్డులో రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారమని స్థానికులు చెబుతున్నారు. దాదాపు కిలోమీటర్ పైనే రోడ్డు జగన్ సెక్యూరిటీ అధీనంలో ఉండేదని, ఆ రూట్ లో ఎవరు వచ్చినా పోలీసులు ఆపేవారని చెప్పారు. తాడేపల్లిలో జగన్ ప్యాలస్ సమీపంలో ఉండే ఓ డాక్టర్ తాజాగా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కున్న దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎలాంటి అవరోధాలు, సెక్యూరిటీ తనిఖీలు లేకుండా తొలిసారి ప్రయాణిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పారు.

ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ లో రీపోస్ట్ చేసింది. తన ఇంటి పక్కన నివసించే ప్రజలను జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడో అక్కడ ఉండే ఓ డాక్టర్ చెబుతున్నాడు వినండంటూ క్యాప్షన్ జోడించింది. ఏపీ సీఎం నివాసం కావడంతో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ ముందు సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉండేదని సదరు డాక్టర్ చెప్పారు. ఆసుపత్రికి వెళ్లేటపుడు, తిరిగి వచ్చేటపుడు సెక్యూరిటీ పేరుతో పోలీసులు తమ వాహనాన్ని ఆపేసి సోదాలు చేసేవారని అన్నారు. ప్రతిరోజూ ఇదే తంతు కొనసాగేదని, దీంతో చాలా ఇబ్బంది పడ్డామని వివరించారు. తాజాగా ఈ రోడ్డులో సెక్యూరిటీ పోస్ట్ ఎత్తేయడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News