మహిళలపై నేరాలను చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు: నారా భువనేశ్వరి

  • చీరాల ఘటనను ప్రస్తావిస్తూ ట్వీట్ చేసిన ఏపీ సీఎం అర్ధాంగి 
  • హోంమంత్రి అనితకు అభినందనలు తెలిపిన భువనేశ్వరి
  • భవిష్యత్తులోనూ మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆశాభావం  
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు మంచి రోజులు వచ్చాయని, మహిళల పట్ల నేరాలను ఎంతమాత్రం సహించని ప్రభుత్వం ఏర్పడిందని సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. న్యాయం కోసం మహిళలు పరుగులు పెట్టే రోజుల నుంచి సత్వర న్యాయం జరిగేలా పరిస్థితులు మారిపోయాయని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.

చీరాలలో 21 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఏపీ పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారని గుర్తుచేస్తూ హోంమంత్రి అనితకు, పోలీసులకు ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు. చంద్రబాబు సర్కారు మహిళల రక్షణ విషయంలో ఎంతమాత్రం రాజీపడబోదని స్పష్టం చేశారు. మహిళల రక్షణ విషయంలో పోలీసులు, హోంమంత్రి అనిత అంకితభావంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే కమిట్ మెంట్ కొనసాగుతుందని ఆశిస్తూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.


More Telugu News