భారతీయుడు-2లోని మెసేజ్ అందరికీ చేరాలి: కమల్ హాసన్
- కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు-2
- శంకర్ దర్శకత్వంలో సీక్వెల్
- జులై 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ మీడియా సమావేశంలో... కమల్ హాసన్ మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులే తనను స్టార్‌ను చేశారని, తెలుగులోనే తనకు క్లాసిక్ హిట్స్ ఉన్నాయని వెల్లడించారు. భారతీయుడు 2లో సేనాపతి చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సమాజంలోంచి వచ్చినట్టే ఉంటాయని స్పష్టం చేశారు. రెండు వేళ్లు మడత పెట్టడం అంటే.. ఒకటి ఓటు వేసేది.. రెండోది మన బాధ్యతది చెప్పేది అని వివరించారు. సాంగ్, ఫైట్స్ ఉన్నాయా? అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు... అవన్నీ ఇందులో ఉంటాయని కమల్ పేర్కొన్నారు. అయితే ఆ సాంగ్స్, ఫైట్స్ డిఫరెంట్‌గా ఉంటాయని తెలిపారు.
"నేను తనకి గురువునని సిద్దార్థ్ ప్రతిసారి చెబుతుంటాడు. నేను కూడా శివాజీ గణేశన్ గారు నా గురువని చెబుతుండేవాడిని. సిద్దార్థ్, నేను ఏకలవ్య శిష్యుల్లాంటి వాళ్లం. ఇంకా కమల్ హాసన్ లాంటి వారు రావాలి... సిద్దార్థ్ లాంటి వారు వస్తూ ఉండాలి. ఇండస్ట్రీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. భారతీయుడు 2 చిత్రాన్ని అందరూ వీక్షించండి. ఈ సినిమాలోని మెసెజ్ అందరికీ చేరాలి. అందుకోసం మీడియా మాకు సహకరించాలి. ఈ సినిమాను జనాల వరకు తీసుకెళ్లండి. జులై 12న మా చిత్రాన్ని థియేటర్లో చూడండి" అని కమల్ హాసన్ పేర్కొన్నారు.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ... భారతీయుడు టైంలో సీక్వెల్ తీస్తానని అనుకోలేదని వెల్లడించారు. భారతీయుడు-2 అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంటుందని చెప్పారు. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లే ప్రతీ ప్రేక్షకుడి మైండ్‌లో ఓ ఆలోచన పుడుతుందని, ప్రతీ ఒక్క టెక్నీషియన్ కోసం ఈ సినిమాను చూడొచ్చని అన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కించినట్టు శంకర్ వివరించారు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్న సురేష్ బాబు గారికి థాంక్స్... జులై 12న ఈ చిత్రం రాబోతోంది... అందరూ చూడండి అని అన్నారు.
సిద్దార్థ్ మాట్లాడుతూ... భారతీయుడు 2 అనేది ఓ యాంటీ వైరస్ లాంటిదని అభివర్ణించారు. సమాజంలోని వైరస్‌ను తీసేందుకు శంకర్ గారు తీసుకొచ్చిన అప్ డేటెడ్ యాంటి వైరస్ ఈ మూవీ అని వివరించారు. "కమల్ హాసన్ గారు నాకు ఇష్టమైన హీరో. జయసుధ గారు నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారు. ఈ చిత్రంలో నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్ గారికి థాంక్స్. ఓ క్రిష్టోఫర్ కొలంబస్‌లా శంకర్ గారు నన్ను కనిపెట్టి హీరోగా తీసుకొచ్చారు. మళ్లీ 20 ఏళ్ల తరువాత అవకాశం ఇచ్చారు. నా ఫస్ట్ 20 ఏళ్ల కెరీర్ బాయ్స్‌తో గడిపేశా.. రాబోయే 20 ఏళ్లు భారతీయుడు 2తో గడిపేస్తా" అని పేర్కొన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ... "ట్రైలర్ చూసిన వెంటనే శంకర్ గారి నంబర్ కనుక్కుని మెసెజ్ చేశాను. కమల్ హాసన్ గారు మన ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. సోషల్ మెసేజ్ ఇస్తూ, ఎంటర్టైన్ మెంట్ యాడ్ చేస్తూ తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. జెంటిల్‌మెన్ సినిమా ఇప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. నేను కూడా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని నడుపుతున్నాను. నిజాయతీగా మనం ఏదైనా చేస్తే వచ్చే సంతోషం మామూలుగా ఉండదు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నాం" అని అన్నారు.
రకుల్ ప్రీత్ మాట్లాడుతూ... "భారతీయుడు సినిమా సీక్వెల్‌లో నేను నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. కమల్ హాసన్ సర్‌తో పని చేయడం అంటే కల నెరవేరినట్టే. సిద్ధార్థ్ తో నటించడం ఆనందంగా ఉంది. యూనిట్ అంతా కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశాం. సురేష్ బాబు గారు ఈ సినిమాను భారీ ఎత్తున జూలై 12న విడుదల చేస్తున్నారు. అందరూ తప్పకుండా చూడండి" అని తెలిపారు.