ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

  • సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు లేక నీళ్లు అడుగంటుతున్నాయన్న హరీశ్ రావు 
  • గత ఏడాది ఇదే నెలలో జలాశయాల్లో నీరు నిల్వ ఉందని వెల్లడి
  • వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న మాజీ మంత్రి
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు నీళ్లు లేక అడుగంటిపోతున్నాయని అందులో విమర్శించారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 

గత ఏడాది ఇదే నెలలో ఆయా జలాశయాల్లో నీరు నిల్వ ఉందన్నారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా తక్కువ నీరు ఉందన్నారు. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వారిలో పంట వేయాలా? వద్దా? అనే సందిగ్ధత నెలకొందన్నారు. మిడ్ మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని హరీశ్ రావు కోరారు.


More Telugu News