కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌.. కోర్టులో నిందితుడి ట్విస్ట్‌.. ఏ త‌ప్పు చేయ‌లేదంటూ భావోద్వేగం!

  • యావ‌త్ దేశాన్ని క‌లచివేసిన ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార ఘ‌ట‌న 
  • తాజాగా నిందితుడు సంజ‌య్ రాయ్‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చిన సీబీఐ
  • విచార‌ణ‌లో భాగంగా కోర్టులో సంజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు  
కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌లచివేసింది. ఈ నేప‌థ్యంలో బాధితురాలికి మ‌ద్ద‌తుగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ప్ర‌తిఒక్క‌రూ నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాలని కోరారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో నిందితుడు సంజ‌య్ రాయ్ ట్విస్ట్ ఇచ్చాడు. తాజాగా అత‌డిని సీబీఐ అధికారులు కోర్టులో హాజ‌రుప‌రిచారు.

అయితే, విచార‌ణ‌లో భాగంగా కోర్టులో సంజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ప‌లు జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడు పాలిగ్రాఫ్ ప‌రీక్ష‌కు అంగీక‌రించ‌డంతో న్యాయ‌స్థానం అధికారులకు అనుమ‌తి ఇచ్చింది. 

ఈ సంద‌ర్భంగా పాలిగ్రాఫ్ టెస్టుకు ఎందుకు అంగీక‌రించావ్? అని మేజిస్ట్రేట్ సంజ‌య్ రాయ్‌ను ప్ర‌శ్నించారు. దాంతో అత‌డు భావోద్వేగానికి గుర‌య్యాడ‌ట‌. "నేను అమాయ‌కుడిని. ఏ త‌ప్పు చేయ‌లేదు. న‌న్ను ఇందులో కావాల‌ని ఇరికించారు. ఈ ప‌రీక్ష‌లో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది" అని నిందితుడు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.


More Telugu News