సోనాలి బింద్రే ఆ సీన్ చేయడానికి చాలా భయపడింది: దర్శకుడు బి.గోపాల్

  • 2022లో వచ్చిన 'ఇంద్ర' సినిమా 
  • చిరూ కెరియర్లో ప్రత్యేక స్థానం
  • దర్శకుడిగా బి. గోపాల్ ఇమేజ్ ను పెంచిన చిత్రం  
  • కాశీలోని గంగ సీన్ గురించిన ప్రస్తావన

చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'ఇంద్ర' ఒకటి. చిరంజీవి లుక్ పరంగా .. కథాకథనాల పరంగా .. సృష్టించిన సంచలనం పరంగా ఈ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అలాంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 22 ఏళ్లు పూర్తయ్యాయి. సోనాలి బెంద్రే - ఆర్తీ అగర్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, బి. గోపాల్ దర్శకత్వం వహించారు. 

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బి. గోపాల్ మాట్లాడారు. " సోనాలి బెంద్రే .. ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కూడా మంచి అందగత్తెలు. ఆ పాత్రలకు వాళ్లు సరిగ్గా సరిపోయారు. ఈ సినిమాలో సోనాలి గవర్నర్ కూతురుగా నటించింది. కాశీకి సంబంధించిన షెడ్యూల్లో ఆమె మొదటిసారిగా షూటింగులో పాల్గొన్నారు. ఆమె గంగలో మునకేసి లేవగానే, ఆమె మెడలోని పూలమాల చిరంజీవి మెడలోకి చేరుతుంది .. అది సీన్. 

" ఈ సీన్ గురించి చెప్పగానే సోనాలి కంగారు పడిపోయింది. "సార్ నాకు నీళ్లంటే చాలా భయం .. మునిగితే చచ్చిపోతాను .. నా వల్ల కాదు సార్" అని చెప్పింది. "అయ్యో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ .. హీరోతో ముడిపడిన సీన్ .. తప్పకుండా చెయ్యాలి .. నీ ప్రాణానానికి నా ప్రాణం అడ్డు.  నీ చుట్టూ మనుషులను పెడతాను .. భయపడవలసిన పనిలేదు .. ఒక్కసారి మునిగి పైకి లే చాలు" అన్నాను. మొత్తానికి ఆ సీన్ చేసింది .. ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది" అని చెప్పారు. 



More Telugu News