రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' నుంచి మరో అప్ డేట్

  • రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
  • శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • ఇప్పటికే ఆడియన్స్ ను ఆకట్టుకున్న 'జరగండి' పాట
  • రెండో పాటపై భారీ అంచనాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం 'గేమ్ చేంజర్'. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి వినాయకచవితి రోజున ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. 'గేమ్ చేంజర్' నుంచి రెండో పాట వచ్చేస్తోందంటూ అభిమానులకు చిత్రబృందం హుషారైన వార్త చెప్పింది. ఈ సందర్భంగా పక్కా మాస్ లుక్ లో ఉన్న రామ్ చరణ్ పోస్టర్ ను పంచుకుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'జరగండి జరగండి' పాట ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాట వీడియోలో చూపించిన విజువల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. 

ఇప్పుడు రెండో పాట అంతకుమించి ఉంటుందని భావిస్తున్నారు. మెగా ఫెస్టివల్ గ్యారంటీ అంటూ చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సెకండ్ సాంగ్ పై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ 'సారేగమ' ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. 

శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాను 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. 


More Telugu News