ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు ముహూర్తం కుదిరింది!

  • వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న స్పిరిట్‌  
  • ఒకేసారి మూడు చిత్రాలను అంగీకరించిన ప్రభాస్‌ 
  • స్పిరిట్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా ప్రభాస్‌
బాహుబలి చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ఇప్పుడు సినిమాల వేగం పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో ఉన్న క్రేజీ పాన్‌ ఇండియా కథానాయకుల్లో ప్రభాసే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అంగీకరించిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగా, మరో సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నారు. 

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న రాజాసాబ్‌ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దాదాపు నలభై నుంచి 50 రోజుల చిత్రీకరణ బ్యాలెన్స్‌గా వుంది. ప్రభాస్‌ అదే సమయంలో హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఫౌజీ చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నాడు. 

ఇక ఈ రెండు చిత్రాల షూటింగ్‌ పూర్తవగానే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. 

ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఈ కేవలం ఈ సినిమా మీద ఫోకస్‌ పెట్టనున్నట్లు ఈ సమయంలో ఇతర చిత్రాలు కూడా అంగీకరించకూడదని ప్రభాస్‌ నిర్ణయం తీసుకున్నాడట. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టీ సీరిస్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఓ మంచి ముహుర్తాన్ని స్పిరిట్‌ చిత్రం గ్రాండ్‌ లాంచింగ్‌ కోసం ఫిక్స్‌ చేసినట్లుగా సమాచారం. 


More Telugu News