భారత డిజిటల్ విప్లవం ప్రపంచానికి ఓ ఉదాహరణ: నోబెల్ గ్రహీత పాల్ రోమెర్

  • రెండ్రోజుల పాటు జరగనున్న ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్
  • భారత్ వచ్చిన నోబెల్ విజేత పాల్ రోమెర్
  • మోదీ సర్కారుపై ప్రశంసల వర్షం 
భారత్ సాధించిన డిజిటల్ విప్లవం పట్ల నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ పాల్ మైకేల్ రోమెర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత డిజిటల్ విప్లవం అత్యంత స్ఫూర్తిదాయకమైన, ఆసక్తికరమైన విజయగాథల్లో ఒకటని అభివర్ణించారు. 

ఈ డిజిటల్ విప్లవం ప్రజా జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, తక్కిన ప్రపంచానికి ఉదాహరణలా నిలిచిందని అభివర్ణించారు. ప్రపంచ శక్తులకు సరికొత్త ప్రమాణాలను నిర్దేశించిందని వివరించారు. ఈ క్రమంలో ఆయన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని అభినందించారు. మోదీ సర్కారు డిజిటల్ విప్లవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగిందని కొనియాడారు.

ప్రొఫెసర్ పాల్ రోమెర్ గతంలో ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ గా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఎన్డీటీవీ నిర్వహించనున్న ప్రపంచ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన ఆలోచనలు పంచుకున్నారు.


More Telugu News