రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' నుంచి రేపే టీజర్ రిలీజ్... ప్రోమో ఇదిగో!

  • రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా గేమ్ చేంజర్
  • శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం 
  • జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'గేమ్ చేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ ఈ చిత్రం నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ భారీ చిత్రం 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా, 'గేమ్ చేంజర్' నుంచి రేపు (నవంబరు 9) టీజర్ రిలీజ్ కానుంది. ఇందుకోసం చిత్రబృందం నేడు టీజర్ ప్రోమో రిలీజ్ చేసింది. శంకర్ మార్కు ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని టీజర్ ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో, రేపు విడుదలయ్యే టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

'గేమ్ చేంజర్' చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.


More Telugu News