ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్
- 17 మంది బ్యాంకు ఖాతాలను నెల రోజులు నిలిపి వేయనున్నట్లు తెలిపిన పోలీసులు
- బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ
- ఖాతాలు, ట్రాన్సాక్షన్స్ వివరాలు వెల్లడించాలని సూచన
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి చెందిన బ్యాంకు ఖాతాలను బంగ్లాదేశ్ ఫ్రీజ్ చేసింది. బంగ్లాదేశ్ పోలీసులు ఇస్కాన్ గురువును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ జెండాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
చిన్మయ్ కృష్ణదాస్‌తో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17 మంది బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ను కూడా నెల రోజులు నిలిపివేయనున్నట్లు బంగ్లా పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ మేరకు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇస్కాన్‌తో సంబంధమున్న 17 మంది బ్యాంకు ఖాతాల సమాచారం, ట్రాన్సాక్షన్స్ వివరాలను బ్యాంకులు మూడు రోజుల్లోగా పంపాలని బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షిల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సూచించింది.
ఇదిలా ఉండగా, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ విషయమై ఇస్కాన్ దూరం పాటిస్తోందని జరుగుతోన్న ప్రచారంపై ఆధ్యాత్మిక సంస్థ స్పందించింది. ఈ అరెస్టుకు తాము దూరం జరగలేదని, ఖండిస్తున్నామని ఇస్కాన్ తెలిపింది. తాము చిన్మయ్ కృష్ణదాస్‌కు అండగా ఉంటామని ప్రకటించింది.