సీఎంగా తొలిసారి 'గజ్వేల్‌'లో రేవంత్ రెడ్డి పర్యటన... కోకాకోలా ప్లాంట్ ప్రారంభం

  • సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం
  • ప్లాంట్ అంతా కలియదిరిగిన ముఖ్యమంత్రి
  • కూల్ డ్రింక్ తయారీ వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన ఇవాళ సిద్దిపేట జిల్లాలో కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇందుకోసం ఆయన మాజీ సీఎం నియోజకవర్గంలో పర్యటించారు.

సిద్దిపేట జిల్లాలోని బండతిమ్మాపూర్‌లో హెచ్ఎస్‌ఎస్‌బీ కోకాకోలా ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోకాకోలా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం అంతా కలియదిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.


More Telugu News