నన్ను తీసేసి... సెట్ కొట్టుకుపోయిందని అబద్ధం చెప్పారు: నటుడు తిరుపతి ప్రకాశ్!

  • బండ్ల గణేశ్ తన స్నేహితుడన్న ప్రకాశ్ 
  • కాకపోతే తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేదని వెల్లడి 
  • ఒక సినిమా కోసం 60 రోజులు డేట్స్ తీసుకున్నారని వివరణ 
  • షూటింగు కేన్సిల్ అయిందని అబద్ధమాడారని వ్యాఖ్య

తిరుపతి ప్రకాశ్... నిన్నటితరం కమెడియన్స్ లో ఒకరు. చాలామంది సీనియర్ కమెడియన్స్ తో కలిసి ఆయన పనిచేశారు. రీసెంటుగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించారు. "బండ్ల గణేశ్... నేను చాలా మంచి స్నేహితులం... కానీ అతనంటే నాకు ఇప్పటికీ కోపం ఉంది. ఎందుకంటే ఆయన తీసిన ఏ సినిమాలోనూ నాకు ఛాన్స్ ఇవ్వలేదు" అని అన్నారు. 

"గణేశ్ - కల్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ సినిమా షూటింగును 'పొల్లాచ్చి'లో ప్లాన్ చేశారు. ఆ సినిమా కోసం 60 రోజులు అక్కడే ఉండిపోవలసి వస్తుందని గణేశ్ చెబితే ఓకే అన్నాను. ఆ సినిమా కోసం... నాలుగైదు అవకాశాలను వదులుకున్నాను. మరుసటి రోజున నేను 'పొల్లాచ్చి' బయలుదేరాలని అనుకుంటూ ఉండగా అక్కడి నుంచి నాకు కాల్ వచ్చింది" అని అన్నారు. 

'పొల్లాచ్చి'లో వర్షాల కారణంగా... సెట్ కొట్టుకుపోయిందని, అందువలన షూటింగ్ కేన్సిల్ అయిందని నాకు ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. తాము సాంగ్స్ షూట్ కి వెళుతున్నామని అన్నాడు. అలా జరిగినందుకు కొన్ని రోజుల పాటు ఆలోచించి ఆ తరువాత సరిపెట్టుకున్నాను. కానీ అదంతా అబద్ధమనీ... నాకంటే తక్కువకి చేస్తానని వేరేవారు రావడంతో నన్ను తీసేశారని ఆ తరువాత నాకు తెలిసింది" అని చెప్పారు.  



More Telugu News