మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందే: హైకోర్టు

  • ప్రజాభవన్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో సాహిల్‌పై కేసు
  • ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయిన సాహిల్
  • పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు
బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ ఈ నెల 16న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రజాభవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో సాహిల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కేసు నమోదైన తర్వాత సాహిల్ దుబాయ్‌కి వెళ్లిపోయాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు తాజాగా, అతను దుబాయ్ నుంచి వచ్చి, పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. పోలీసుల విచారణకు సాహిల్ సహకరించాలని స్పష్టం చేసింది.

ప్రజాభవన్ గేట్లను కారు ఢీకొన్న కేసులో సాహిల్‌ను తప్పించి డ్రైవర్ ఆసిఫ్‌ను నిందితుడిగా చేర్చేందుకు పంజాగుట్ట సీఐ దుర్గారావు ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు సీఐని సస్పెండ్ చేశారు.  


More Telugu News