బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది!

  • ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం
  • రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం
  • రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ప్రాదేశిక హిందూ మహా సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. 

కాగా, అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, రాగల 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబరు 11 నాటికి ఇది శ్రీలంక-తమిళనాడు తీరాలకు అనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని ఐఎండీ వివరించింది. 

దీని ప్రభావంతో రేపు (డిసెంబరు 8) ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


More Telugu News