దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేసిన దువ్వాడ... వీడియో వైరల్

  • దివ్వెల మాధురి బర్త్ డే ఫంక్షన్
  • సందడి చేసిన దువ్వాడ శ్రీనివాస్
  • తాను మాధురిని ఎప్పటికీ ప్రేమిస్తుంటానన్న దువ్వాడ
  • ఐ టూ అంటూ సంతోషం వ్యక్తం చేసిన మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని నెలలుగా వీరి మధ్య రిలేషన్ షిప్ చర్చనీయాంశంగా ఉంది. తాజాగా, దివ్వెల మాధురి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తన ప్రేయసి దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేయడం వైరల్ గా మారింది. 

తాను మాధురిని ఎప్పటికీ ప్రేమిస్తుంటానని మీడియా ముఖంగా దువ్వాడ చెప్పగా... దివ్వెల మాధురి కూడా ఐ టూ ఆల్వేస్ లవ్యూ అంటూ సంతోషంగా చెప్పేసింది. మీడియా రిపోర్టర్ స్పందిస్తూ... ఇలా కాదు... ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఐ లవ్యూ చెప్పుకోండి అని సూచించగా... మాధురి, దువ్వాడ అలాగే చేశారు. 

మాధురి బర్త్ డే ఫంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, తామిద్దరం మనస్ఫూర్తిగా కలిశామని, మనస్ఫూర్తిగా పనిచేసుకుంటున్నామని, మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మాధురి తనకు వాచ్ కొనిచ్చిందని, ఇప్పుడు తాను ఆమెకు ఇంతకు రెట్టింపు బహుమతి ఇవ్వాల్సి ఉందని అన్నారు.


More Telugu News