బ్రిస్బేన్ టెస్టు.. ఆసీస్ 445 ప‌రుగుల‌కు ఆలౌట్‌

  • బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య‌ మూడో టెస్టు
  • ఆతిథ్య జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 117.1 ఓవ‌ర్ల‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌట్
  • ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) శ‌త‌కాలు
  • 6 వికెట్ల‌తో రాణించిన జ‌స్ప్రీత్ బుమ్రా
బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య‌ జ‌రుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జ‌ట్టు 445 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 405/7 తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మ‌రో 40 ప‌రుగులు జోడించి మిగ‌తా మూడు వికెట్లు కోల్పోయింది. 

ఈ మ్యాచ్‌లో మొద‌ట టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 117.1 ఓవ‌ర్ల‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) శ‌త‌కాల‌తో మరోసారి టీమిండియా బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం చెలాయించారు. 

అలాగే కీప‌ర్ అలెక్స్ కేరీ అర్ధ శ‌త‌కం (70) తో రాణించ‌గా, ఉస్మాన్ ఖ‌వాజా (21), ప్యాట్ క‌మిన్స్ (20) ర‌న్స్‌తో ప‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా 6 వికెట్ల‌తో రాణించాడు. అలాగే సిరాజ్ 2 వికెట్లు తీయ‌గా.. ఆకాశ్ దీప్‌, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ ప‌డగొట్టారు. 


More Telugu News