అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదన్న సీఎం
- మహిళ మృతి చెందినా అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లలేదన్న రేవంత్
- అల్లు అర్జున్ ను డీసీపీ బలవంతంగా కారు ఎక్కించారని వెల్లడి
- బయటకు వచ్చిన తర్వాత కూడా కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపారని ఆగ్రహం
సినీ హీరో అల్లు అర్జున్ పై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అల్లు అర్జున్ మనిషేనా అని ప్రశ్నించిన రేవంత్... ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, థియేటర్ బయట పరిస్థితి బాగోలేదని, మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోకపోతే పరిస్థితి అదుపుతప్పుతుందని డీసీపీ చెప్పినా... సినిమా చూసి వెళతానని అల్లు అర్జున్ చెప్పారని మండిపడ్డారు.
మీరు వెళ్లకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని డీసీపీ హెచ్చరించి, ఆయనను బలవంతంగా కారులో ఎక్కించారని తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోకుండా... కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి, చేతులు ఊపుతూ వెళ్లాడని విమర్శించారు. అంత జరిగిన తర్వాత కూడా చేతులు ఊపుతూ ఉన్నాడంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమని చెప్పారు.
ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతించబోమని రేవంత్ స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు కుదరవని, టికెట్ ధరల పెంపు ఉండదని అన్నారు.