కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర.. నిగమ్ బోధ్ ఘాట్ లో అంత్యక్రియలు
- ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభం
- నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమ యాత్ర
- సైనిక లాంఛనాలతో జరగనున్న అంత్యక్రియలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమయింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్ ఘాట్ సమీపంలో ఉన్న నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. మన్మోహన్ ను తరలిస్తున్న వాహనంలో... ఆయన పార్థివదేహం పక్కన రాహుల్ గాంధీ ఉన్నారు. నిగమ్ బోధ్ ఘాట్ లో మన్మోహన్ అంత్యక్రియలు జరుగుతాయి. సైనిక లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది.
మన్మోహన్ పార్థివదేహాన్ని ఈ ఉదయం ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన పార్థివదేహానికి పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళి అర్పించారు. మన్మోహన్ పార్థివదేహానికి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. మన్మోహన్ భార్య గుర్ శరణ్ కౌర్, ఆయన కుమార్తె పార్థివదేహం వద్ద ఉన్నారు.
మరోవైపు మన్మోహన్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.