రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజుల రిమాండ్

  • మచిలీపట్నం పీడీఎస్ గోడౌన్ నుంచి బియ్యం మాయం కేసులో నిందితుల అరెస్టు
  • సోమవారం రాత్రి నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన పోలీసులు
  • రిమాండ్ ఉత్తర్వులతో సబ్ జైలుకు నిందితులు
మచిలీపట్నం సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాయం అయిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయింది. ఈ కేసులో ఏ 1గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అర్ధాంగి పేర్ని జయసుధకు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈమెకు న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. 

అయితే, ఈ కేసులో తదుపరి నిందితులుగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సోమవారం రాత్రి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి ముందు హజరుపర్చగా.. వీరికి న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను పోలీసులు మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. 


More Telugu News