హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్

  • గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసు
  • పేర్ని నానిని ఏ6గా చేర్చిన పోలీసులు
  • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పేర్ని నాని పిటిషన్
తమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ  హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పేర్ని నాని పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిటిషన్ ను విచారించనుంది. 

మరోవైపు, ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరయింది. కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు మాత్రం మచిలీపట్నం సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.


More Telugu News