పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట

  • గోడౌన్ లో బియ్యం మాయమైన వ్యవహారంలో పేర్ని నానిపై కేసు నమోదు
  • పేర్ని నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిపై మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆయనను ఏ6గా పోలీసులు పేర్నొన్నారు. తనపై కేసు నమోదైన కాసేపటికే పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. 

పేర్ని నాని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో, పేర్ని నానికి స్వల్ప ఊరట లభించినట్టయింది.


More Telugu News