హైదరాబాదులో పోలీస్ కానిస్టేబుల్ బలవన్మరణం

  • తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు
  • ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జటావత్ కిరణ్ 
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇటీవల కాలంలో ఎంతో మంది క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యులను శోక సంద్రంలోకి నెట్టేస్తున్నారు. విద్యార్ధులు మొదలు కొని వ్యాపారులు, ఉద్యోగులు మానసిక ఆందోళనతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఒక ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే తాజాగా హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకున్నాడు. 

ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జటావత్ కిరణ్ (36) నిన్న సాయంత్రం తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బంధువులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కానిస్టేబుల్ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడంపై సహచర ఉద్యోగులు విస్మయానికి గురయ్యారు. కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.    


More Telugu News