చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌల‌ర్ ట‌స్కిన్ అహ్మ‌ద్

    
బంగ్లాదేశ్ బౌల‌ర్ ట‌స్కిన్ అహ్మ‌ద్ చ‌రిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా రికార్డుకెక్కాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ (బీపీఎల్‌) 2024-25లో ద‌ర్బార్ రాజ్‌షాహీ జట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ట‌స్కిన్... ఢాకా క్యాపిట‌ల్స్ పై త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 19 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో శ్యాజ్రుల్ ఇద్రుస్ (7/8), అక‌ర్మాన్ (7/18)ల స‌ర‌స‌న చేరాడు. అలాగే బీపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఇన్నింగ్స్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డు సృష్టించాడు.


More Telugu News