నడి రోడ్డుపై భర్తను చంపిన భార్య.. ఏపీలో ఘటన

  • తాగుడుకు బానిసైన భర్త
  • భార్య, భర్త మధ్య తరచుగా గొడవలు
  • కిందపడ్డ భర్త గొంతుకు తాడు వేసి లాగిన భార్య
నడి రోడ్డుపై భర్త మెడకు తాడు బిగించి భార్య హత్య చేసిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లాలో జరిగింది. కొత్తపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళితే... కొత్తపాలెంకు చెందిన అరుణకు గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం పెళ్లయింది. అమరేంద్రబాబు నాలుగేళ్ల క్రితం మద్యానికి బానిస అయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. గొడవల నేపథ్యంలో ఆమె భర్తను వదిలేసి స్వగ్రామం కొత్తపాలెంలో ఉంటోంది. 

దీంతో ఆమె ఇంటికి వెళ్లిన అమరేంద్రబాబు ఆమెతో మళ్లీ గొడవపడ్డాడు. తన భార్య అరుణను కొట్టాడు. దీంతో అతనిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిలో కింద పడ్డ అమరేంద్ర గొంతుకు అరుణ తాడు వేసి లాగి చంపేసింది.


More Telugu News