బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

  • ఈ నెల 11 నుంచి 15 వరకు జగన్ యూకే పర్యటన
  • కుటుంబ సమేతంగా వెళుతున్నామన్న వైసీపీ అధినేత
  • అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన న్యాయస్థానం
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును అనుమతి కోరారు. జనవరి 11 నుంచి 15 వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ నేడు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ తర్వాత వాదనలు వింటామని స్పష్టం చేసింది. 

కాగా, తాను కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాలనుకుంటున్నట్టు జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ కుమార్తెలు యూకేలో విద్యాభ్యాసం చేస్తుండడం తెలిసిందే. 

అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ పై బయటున్నారు. అందువల్ల, ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. గత కొన్నేళ్లుగా ఆయన కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళుతున్నారు.


More Telugu News