ఈసారి జ‌గ‌న్ సొంత జిల్లాలో వైసీపీకి షాక్

  • మైదుకూరు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ చంద్ర వైసీపీకి రాజీనామా
  • గ‌తకొంత‌కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న చంద్ర‌
  • ఈరోజు వైసీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టన‌
ఇటీవల కాలంలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో మరో షాక్ త‌గిలింది. మైదుకూరు మున్సిప‌ల్ ఛైర్మ‌న్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గ‌తకొంత‌కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న... ఈరోజు వైసీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ఈ క్ర‌మంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌తో మాట్లాడించాల‌ని గ‌త మూడు నెల‌లుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. అనుచ‌రుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చంద్ర తెలిపారు. కాగా, ఆయ‌న జ‌న‌సేన లేదా టీడీపీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. 

ఇక‌, నిన్న వైసీపీకి చెందిన సీనియర్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన‌ జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె క‌మలం పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆమె రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య‌ ఆరుకు చేరింది.


More Telugu News