ఏపీకి వర్ష సూచన
- ఏపీలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు
- గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలో ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్ఠంగా 40 మి.మీ, రాజమహేంద్రవరంలో 30 మి.మీ, చిత్తూరులో 19 మి.మీ, అమలాపురంలో 18 మి.మీ, కంభం, కాకినాడలో 13 మి.మీ, యానాం, నెల్లూరులో 6.6 మి.మీ, తణుకులో 4.8 మి.మీ, బాపట్లలో 4.3 మి.మీ, కావలిలో 4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.