అందం అనేది చూసే చూపును బట్టి మారుతుంది. అయినప్పటికీ అంతర్జాతీయంగా నిర్వహించే పలు గ్లోబల్ సర్వేలు, నిపుణుల పారామీటర్ల ఆధారంగా ప్రతి సంవత్సరం ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలు ఉన్న దేశాల’ జాబితాను విడుదల చేస్తుంటారు. ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ విడుదల చేసిన నివేదికల ఆధారంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ఏయే దేశాలు ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాం..

1. టర్కీ: ఈ గ్లోబల్ సర్వేలో టర్కీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. వైవిధ్యమైన సంస్కృతుల కలయిక, క్లాసిక్ మెడిటరేనియన్ శైలి, సహజసిద్ధమైన ఆకర్షణకు టర్కీ మహిళలు మారుపేరు. వారి చక్కటి ఆహార్యం, ప్రత్యేకమైన శారీరక సౌష్టవం అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందాయి.

2. వెనెజువెలా: దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న ఈ దేశానికి అంతర్జాతీయ అందాల పోటీల్లో తిరుగులేని రికార్డు ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌ కిరీటాలను గెలుచుకున్న దేశాల్లో ఇదొకటి. అందుకే ఈ దేశాన్ని అంతర్జాతీయంగా ‘బ్యూటీ క్వీన్ ఫ్యాక్టరీ’ అని కూడా పిలుస్తారు.

3. బ్రెజిల్: దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద దేశమైన బ్రెజిల్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. విభిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం ఉన్న ఈ దేశంలోని మహిళలు తమ ఫిట్‌నెస్, ఆకర్షణీయమైన ఫీచర్లు, చురుకైన స్వభావానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.

4. పాకిస్థాన్‌: ఆసియా ఖండంలో ‘సౌత్ ఏషియా ఇండెక్స్’ వంటి సర్వేల్లో పాకిస్థాన్‌కు అగ్రస్థానం లభించింది. ఆ దేశ మహిళల నడవడిక, సహజమైన గ్రేస్, సాంప్రదాయక సౌందర్యం అంతర్జాతీయ వేదికలపై ఎంతో ప్రశంసలు అందుకున్నాయి.

5. కొలంబియా: దక్షిణ అమెరికాకు చెందిన కొలంబియా మహిళలు తమ అద్భుతమైన పర్సనాలిటీ, ఆకర్షణతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హాలీవుడ్ నటి సోఫియా వెర్గారా వంటి ప్రముఖ నటీమణులు కొలంబియా సౌందర్యానికి అంతర్జాతీయంగా బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారు.

6. భారతదేశం: ప్రపంచ సుందరి, విశ్వ సుందరి వంటి ఎన్నో అంతర్జాతీయ కిరీటాలను గెలుచుకున్న ఘన చరిత్ర భారతదేశానికి ఉంది. ఐశ్వర్య రాయ్, ప్రియాంకా చోప్రా వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుందరీమణులు భారతీయ సాంప్రదాయక అందాన్ని, చార్మ్‌ను ప్రపంచానికి చాటిచెప్పారు.

7. స్వీడన్: స్కాండినేవియన్ దేశమైన స్వీడన్ మహిళలు తమ విభిన్నమైన, స్పష్టమైన యూరోపియన్ ఫీచర్లకు ప్రసిద్ధి. అద్భుతమైన ఫిట్‌నెస్, లేత రంగు కళ్లు, విలక్షణమైన శైలితో ఈ దేశ మహిళలు అంతర్జాతీయ బ్యూటీ పోల్స్‌లో ఎప్పుడూ ముందంజలో ఉంటారు.

8. లెబనాన్: పశ్చిమాసియాలో ఫ్యాషన్, బ్యూటీ, కాస్మెటిక్ ఇన్నోవేషన్‌కు లెబనాన్ ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ దేశ మహిళలు తమ ప్రత్యేకమైన అరబిక్ శైలి అందం, ట్రెండీ ఫ్యాషన్ సెన్స్‌తో అంతర్జాతీయంగా ఎంతో ఆకర్షణీయమైన జనాభాగా గుర్తింపు పొందారు.

9. ఫిలిప్పీన్స్: మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీల్లో ఈ దేశానికి తిరుగులేని చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే బ్యూటీ పోల్స్‌లో ఎప్పుడూ అగ్రశ్రేణిలోనే నిలిచే ఫిలిప్పీన్స్, పలు అంతర్జాతీయ కిరీటాలను కైవసం చేసుకుని గ్లోబల్ వేదికలపై తన బలమైన ఉనికిని చాటుకుంది. ఈ దేశాన్ని కూడా ‘బ్యూటీ క్వీన్ ఫ్యాక్టరీ’ అని పిలుస్తారు.

10. డెన్మార్క్‌: డెన్మార్క్ మహిళలు తమ సింప్లిసిటీ, స్టైలిష్ లుక్స్, క్లాసిక్ యూరోపియన్ ఫీచర్లతో ప్రపంచ బ్యూటీ లిస్ట్‌లలో క్రమం తప్పకుండా చోటు సంపాదిస్తుంటారు.