ఐక్యరాజ్యసమితి లైంగిక హింస జాబితాలో రష్యా, ఇజ్రాయెల్ దళాలు
- ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్టు ఆరోపణలు
- పాలస్తీనాలో ఇజ్రాయెల్ బలగాలు హింసకు పాల్పడ్డాయన్న ఐరాస
- నివేదికలో తమ పేర్లను చేర్చడంపై రష్యా, ఇజ్రాయెల్ ఆగ్రహం
వివిధ దేశాల్లోని సంక్షోభ ప్రదేశాల్లో లైంగిక హింసపై ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికను విడుదల చేసింది. గత 15 ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను విడుదల చేస్తోంది. అయితే, ఈసారి ఈ జాబితాలో రష్యా, ఇజ్రాయెల్ బలగాల పేర్లను కూడా చేర్చడం వివాదాస్పదమయింది. నివేదికలో తొలిసారి రష్యా, ఇజ్రాయెల్ పేర్లను ఐరాస చేర్చింది.
ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో... రష్యా బలగాలను నివేదికలో ఐరాస చేర్చింది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ బలగాలు చేస్తున్న హింస కారణంగా ఈ దేశం పేరును కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో, ఐరాస నివేదికపై రష్యా, ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడ్డాయి.
ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వెసెల్లీ నింజెంజియా మాట్లాడుతూ... తమ దేశాన్ని విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలో అసత్య ఆరోపణలు ఉన్నాయని మండిపడ్డారు.
ఇజ్రాయెల్ రాయబారి డానీ డాసన్ మాట్లాడుతూ... తమ బలగాలను హమాస్, ఐసిస్ వంటి ఉగ్రవాదుల మాదిరి చూపించారని అన్నారు. తమకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తో పని లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెర్రస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ తో ముగుస్తోంది.