చెత్త వేశాడని ట్రోల్ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య!
- చెత్త వేసిన వీడియో వైరల్
- ఆన్లైన్లో తీవ్ర విమర్శలు
- కేసు నమోదు చేసిన పోలీసులు
- ట్రోలింగ్ భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
- ఆన్లైన్ విమర్శలే కారణమంటున్న కుటుంబం
ఆ వీడియో ఆధారంగా నెటిజన్లు శామ్యూల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు సదరు విద్యార్థిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఆ యువకుడు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల విచారణకు సహకరించాడు.
అయితే, ఓవైపు పోలీస్ కేసు.. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న దారుణమైన కామెంట్లు అతణ్ని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన శామ్యూల్.. శనివారం ఇంట్లోని లైసెన్స్ తుపాకీతో కాల్చుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
డిగ్రీ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన శామ్యూల్.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులతో కలిసి నివసిస్తున్నాడు. వైరల్ వీడియో కారణంగా తమ కొడుకు తీవ్ర కలత చెందాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.