తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జనసేన మద్దతుదారుడుగా ఉన్న చందర్ లాల్, పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ జరిగిన రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. "జనసేనతో పెట్టుకున్నావ్.. రేవంత్ రెడ్డి, నిన్ను బలి ఇస్తాం" అంటూ దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై కేసు (క్రైమ్ నం. 395/2026) నమోదు చేసిన తెలంగాణ పోలీసులు, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, పరిమితులు దాటితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.