మెగా హీరోసాయి దుర్గా తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్తలు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారమవుతున్నాయి. నవంబర్‌ నెలలోనే ఆయన వివాహం జరగనుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు వెలువడుతున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో లేదా వచ్చే వారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

సమాచారం ప్రకారం, నవంబర్ 5న సాయి తేజ్ నిశ్చితార్థం జరగవచ్చని భావిస్తున్నారు. వధువు ఆయన చిన్ననాటి స్నేహితురాలని, ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహానికి అంగీకారం తెలిపారని చెబుతున్నారు. ఇది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మెగా కుటుంబ సభ్యులు, టాలీవుడ్‌లోని సన్నిహితులు, అతికొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుకను నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇక సినిమాల విషయానికొస్తే, 'విరూపాక్ష' తర్వాత కొంత విరామం తీసుకున్న సాయి దుర్గా తేజ్.. 'సంబరాల ఏటి గట్టు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.