- మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ
- టీడీపీలో చేరిన పలువురు సీనియర్ నాయకులు
- వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి చేరిక
- 20 కుటుంబాలకు కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి లోకేశ్
మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబాలతో సహా తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న దామర్ల కుబేరస్వామి, ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ వీరికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన వారిలో మంగళగిరి పట్టణానికి చెందిన సీనియర్ నేత తోలేటి రవీంద్ర, దుగ్గిరాల మండలానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం, బిట్రా శేషాంజనేయులు, బిట్రా శ్రీనివాసరావు వంటి ముఖ్య నాయకులు ఉన్నారు. వీరందరితో పాటు మొత్తం 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
స్వయంగా మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వైసీపీకి చెందిన కీలక నేతలు పార్టీ వీడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఇస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.