మిత్రమా, మనలో మార్పు రావాలి.. మన లక్ష్మీ ప్రసన్న వీడియో చూడాలి: మోహన్ బాబుకు చిరంజీవి రిప్లై
- చిరుకి ట్విట్టర్‌లోకి స్వాగతమన్న మోహన్ బాబు
- 'రాననుకున్నావా?.. రాలేననుకున్నావా?' అంటూ చిరు రిప్లై
- 'ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను' అన్న మోహన్ బాబు
- ఆలింగనాలు వద్దు.. కరచాలనాలు వద్దు.. నమస్తే మాత్రమేనన్న చిరు
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ మోహన్ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి.. 'రాననుకున్నావా?.. రాలేననుకున్నావా?' అని రిప్లై ఇచ్చారు. దీంతో మోహన్ బాబు.. 'ఈ సారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను' అంటూ సమాధానమిచ్చారు.
దీనిపై ఈ రోజు స్పందించిన చిరంజీవి.. 'మిత్రమా ... కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. ఆలింగనాలు వద్దు.. కరచాలనాలు వద్దు.. నమస్తే మాత్రమే పెట్టుకోవాలి. సామాజిక దూరం తప్పనిసరి. దీనిపై మరింత అవగాహన పెంచుకోవడానికి, మనవారిని రక్షించుకోవడానికి మన లక్ష్మీ ప్రసన్న పోస్ట్ చేసిన వీడియో చూడండి' అని ట్వీట్ చేశారు.