ఈ రోజు రాత్రి 9 గంటలకు భారతీయ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెబుదాం: విరాట్ కోహ్లీ
- కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలన్న మోదీ
- విరాట్ కోహ్లీ మద్దతు
- అభిమానుల్లోని పవరే స్టేడియంలోని పవర్
- దేశ ప్రజల్లోని స్ఫూర్తే భారత స్ఫూర్తి
ఈ రోజు రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ స్ఫూర్తిని చాటాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు.
'అభిమానుల్లోని పవరే స్టేడియంలోని పవర్. అలాగే, దేశ ప్రజల్లోని స్ఫూర్తే భారత స్ఫూర్తి. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేశ ప్రజలమంతా ఒకటిగా నిలబడతామని ప్రపంచానికి చాటుదాం. అలాగే, వైద్య సిబ్బందికి మద్దతుగా మనం ఉన్నామని చాటి చెబుదాం. టీమిండియా చైతన్యవంతమైంది' అని ఆయన ట్వీట్ చేశాడు.