తెలంగాణలో మొత్తం ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 1001
- ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 660
- ఈరోజు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11
- డిశ్చార్జి అయిన వారు 9 మంది
తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1001 అని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మీడియా బులిటిన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 660 కాగా, ఈరోజు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11, డిశ్చార్జి అయిన వారు 9 మంది అని పేర్కొంది. ఇవాళ ‘కరోనా’ మరణాలు సంభవించలేదని తెలిపింది.
కాగా, మర్కజ్ కు వెళ్లి ‘కరోనా’ బారిన పడ్డ డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు దాని బారి నుంచి సంపూర్ణంగా బయటపడ్డాడని పేర్కొంది. ఈ సందర్భంగా ‘కరోనా’ కట్టడి నిమిత్తం తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలను మరోమారు సూచించింది. అదే విధంగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కోరింది.
.